News May 5, 2024
KMM: మండే ఎండలో రాజకీయ కాక .!!
ఖమ్మం జిల్లాలో రాజకీయం కాకలు రేపుతోంది. మండు వేసవిలో వచ్చిన ఎన్నికలు ఎండల తీవ్రతలాగే .. రాజకీయ వేడి కూడా పెరుగుతోంది. నియోజకవర్గంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యనే ఉన్నది. అధికార కాంగ్రెస్ ఇటు ప్రచారంతో పాటు.. వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Similar News
News November 5, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అధికారిగా కె. సురేంద్ర మోహన్ నియామకం
రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.
News November 5, 2024
పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే: జిల్లా కలెక్టర్
ఖమ్మం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
News November 4, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
∆} ఖమ్మం:వారికి రెండో ప్రాధాన్యతలో ఇల్లు ఇస్తాం: మంత్రి పొంగులేటి ∆}భద్రాచలం: పవిత్ర గోదావరి నదిలో భక్తుల పుణ్యస్నానాలు∆}ఖమ్మం: కారు- బైక్ ఢీకొని యువకుడు మృతి∆} దమ్మపేట:వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మల∆}భద్రాచలం: రూ. 3 కోట్ల గంజాయి దహనం చేసిన అధికారులు∆}కొత్తగూడెం: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారులు∆}గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి సీతక్క