News February 5, 2025

KMM: మంత్రి పొంగులేటి ప్రకటన.. గ్రామాల్లో సందడి

image

ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Similar News

News July 8, 2025

ఖమ్మం: 15 పాఠశాలలకు రూ.12 కోట్ల నిధులు

image

ఖమ్మం జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

News July 8, 2025

‘రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేయించుకోవాలి’

image

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం రేషన్ కార్డుదారులందరు ఆయా రేషన్ షాపులలో ఈ-కేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 4,15,905 రేషన్ కార్డులకుగాను 12,03,943 మంది ఉన్నారు. ఇందులో 9,64,236 మంది మాత్రమే ఈ-కేవైసీ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారందరూ వెంటనే సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ చేయించాలని సూచించారు.

News July 8, 2025

15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, దీనికి అవసరమైన పటిష్ఠ ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, విద్యా శాఖ, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మధిరలో జి+2 మోడల్‌లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.