News May 10, 2024
KMM: మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరణ

ఒంటరిగా మహిళ ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరించిన ఘటన తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన మహిళ రాధిక ఇంట్లో ఒంటరిగా కూర్చోని ఉండగా ఇంటి వెనుక వైపు నుంచి గుర్తు తెలియని దొంగ లోపలకు ప్రవేశించి రాధిక మొఖంపై మత్తు మందు స్ప్రే చేశాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చేతికి ఉన్న రూ.1.05 లక్షల విలువైన 3 బంగారు గాజులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
Similar News
News February 19, 2025
కొత్తగూడెం: వివాహేతర సంబంధం.. ఇద్దరికి దేహశుద్ధి..!

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఖమ్మంపాడుకు చెందిన మరో వ్యక్తిని మంగళవారం సాయంత్రం చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశామని ఖమ్మంపాడు గ్రామస్థులు తెలిపారు. ఖమ్మంపాడులోని ఓ వివాహితతో గాండ్లగూడెం వాసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని,ఆమె కుటుంబ సభ్యులు గమనించగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశామని చెప్పారు.అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
News February 19, 2025
ఖమ్మం: ‘యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు’

ఖమ్మం జిల్లా పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీకి చెందిన యువతిని అదే కాలనీకి చెందిన సంగాల నరసింహారావు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని వీరనారీమణుల ఆశయ సాధన సమితి సభ్యులు ఆరోపించారు. రఘునాథపాలెంలో సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి, జిల్లా కార్యదర్శి స్పందనను బాధితురాలు మంగళవారం కలిసింది. ఈ మేరకు ఉపేంద్రబాయి మాట్లాడుతూ.. పోలీసులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
News February 19, 2025
ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య

అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.