News March 6, 2025
KMM: మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

ఖమ్మం నగరంలోని రామన్నపేటకు చెందిన షేక్ ఖాసీం(38) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ఖాసీం సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను మంగళవారం రాత్రి డబ్బుకోసం భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 10, 2026
చేగోమ్మలో PACS గోదాం ప్రారంభించిన పొంగులేటి

కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నూతనంగా నిర్మించిన PACS గోదాములను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సంబంధిత అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
News April 10, 2026
ఖమ్మంలో రేపు ఫూలే జయంతి వేడుకలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి ఫూలే చేసిన సేవలను స్మరించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
News April 10, 2026
మధిరలో మహాప్రస్థానం నిర్మాణంపై PPT ప్రజెంటేషన్

మధిరలో సీఎస్ఆర్ నిధులతో ఫీనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న మహాప్రస్థానంపై గురువారం డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి అథారిటీ, పట్టణ ప్రముఖుల అభిప్రాయాలను డిప్యూటీ సీఎం, అధికారులు సేకరించారు. ప్రాజెక్టు రూపకల్పన, అవసరాలపై చర్చించి అభివృద్ధి చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


