News January 31, 2025

KMM: మార్చి 31లోగా రైతు భరోసా: మంత్రి తుమ్మల

image

రైతు భరోసా నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. మార్చి 31వ తేదీలోపు రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించారు. ఒక ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూ.54వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. బడ్జెట్లో రూ.72,000 కోట్ల నిధులను వ్యవసాయం కోసం, వ్యవసాయ అనుబంధ రంగాలకి కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.

Similar News

News February 15, 2025

ఖమ్మం: స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

image

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి స్టేడియంను సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, షటిల్ బ్యాట్ స్కేటింగ్, వ్యాయామ కేందం, జిమ్నాస్టిక్ హాల్, వాలీబాల్ కోర్టును పరిశీలించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, స్పోర్ట్ షూ అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరారు.

News February 15, 2025

KMM: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

News February 15, 2025

ఖమ్మం జిల్లాలో రూ.598 కోట్ల పెండింగ్ కరెంట్ బిల్లులు

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్తు బిల్లులు పేరుకుపోయాయి. విద్యుత్తుశాఖలో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ప్రైవేట్, ప్రభుత్వశాఖల నుంచి మొత్తం రూ.598 కోట్ల బకాయిలున్నాయి. ఇంత మొత్తం బకాయిలు ఉండటంతో ఆ శాఖపై పెనుభారం పడుతోంది. సంబంధిత శాఖ బకాయిలను రికవరీ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఈ బకాయిల్లో సింహభాగం రూ.241 కోట్లు మిషన్ భగీరథవి ఉండటం గమనార్హం.

error: Content is protected !!