News April 27, 2024
KMM: మే 6 నుంచి డిగ్రీ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.
Similar News
News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

ఇంటర్ సెకండియర్ RESULTS.. ఖమ్మం 6వ స్థానం

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఖమ్మం(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14627 మంది పరీక్షలు రాయగా 11936 మంది పాసై 81.60 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1928 మందికి 1429 మంది పాసై 74.12 శాతంతో 16వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1108 మందికి 411 మంది పాసై 37.09%తో 6వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 164 మందికి 79 మంది పాసై 48.17%తో 23rd ప్లేస్ వచ్చింది.