News November 30, 2024
KMM: రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం: మంత్రి తుమ్మల

పదేళ్ల BRS పాలనలో ఛిన్నాభిన్నమైన తెలంగాణను CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాగు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. MBNRసభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ ఆగమైందని, ఏడాదిగా బాగు చేస్తున్నామని తెలిపారు. ‘అన్నా.. కష్టాలున్నా.. అప్పులున్నా.. కడుపు కట్టుకోనైనా సరే రైతు రుణమాఫీ చేద్దామని’ సీఎం అన్నారని కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామన్నారు.
Similar News
News December 1, 2025
ఖమ్మం: నేటి నుంచి కొత్త వైన్స్.. ఎన్నికల జోష్

ఖమ్మం జిల్లాలో ఈరోజు నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ కింద 116 వైన్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, జనావాసాల్లో షాపుల ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జమ్మిబండ వైన్స్ రద్దు కాగా, మరికొన్నింటిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొకవైపు ఈ నెలలో3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో, వైన్స్ వ్యాపారులు తొలి నెలలోనే అమ్మకాలు జోరుగా సాగనున్నాయి.
News December 1, 2025
68 ఏళ్ల ఏకగ్రీవానికి ముగింపు.. తెల్దారుపల్లిలో ఈసారి ఎన్నికల్లేవ్

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. దాదాపు 68 ఏళ్లుగా (1957 నుంచి) 13 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుని, కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఈ గ్రామం చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదు. తెల్దారుపల్లి ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ఈసారి ఎన్నికల సందడి కనిపించడం లేదు.
News December 1, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.


