News November 19, 2024
KMM: రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం: భట్టి

వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వరంగల్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. “అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నాం. ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నెరవేరుస్తోంది. రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తాం. 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించాం” అని చెప్పారు.
Similar News
News March 1, 2026
రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.
News March 1, 2026
ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్ఓ

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.
News March 1, 2026
భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుంది: తుమ్మల

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు చేసిన మోసం బయటకు రాకుండా కొందరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు పశ్చాత్తాపపడతారన్నారు.


