News November 19, 2024
KMM: రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం: భట్టి
వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వరంగల్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. “అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నాం. ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నెరవేరుస్తోంది. రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తాం. 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించాం” అని చెప్పారు.
Similar News
News December 8, 2024
క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లు జరగొద్దు: జిల్లా కలెక్టర్
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా క్షేత్ర స్థాయి డాటా సేకరణలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో MROలు, MPDOలు, MPOలు, మునిసిపల్ కమిషనర్ లకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, అధికారులకు అవగాహన కల్పించారు. రొటీన్ కార్యక్రమంలా భావన వద్దని, ఒక పేదవారికి శాశ్వత ఇంటి హక్కు ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
News December 7, 2024
ఇళ్ల లబ్ధిదారుల వివరాలను యాప్లో ఎంట్రీ చేస్తాం: పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల వివరాలను యాప్‌లో ఒకేసారి ఎంట్రీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అందులో నుంచే దశలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గత పాలకులు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, వాటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అసైన్డ్ భూముల హక్కులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 7, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏం కావాలి..?
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిగిలిన నాలుగేళ్లలో కొత్తగూడెం ఎయిర్ పోర్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్ట్స్ టైల్ పార్క్ పూర్తి, పలు చోట్ల ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, పలు ఐటీ, ఇతర ఇండస్ట్రీస్‌ను తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మిగిలిన నాలుగు ఏళ్లలో జిల్లాకు ఏం కావాలో కామెంట్స్ చేయండి.