News September 10, 2024
KMM: రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు: డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంపునకు రూ.5 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిని 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో తీసుకొస్తామని చెప్పారు. టాటా కంపెనీ సహకారంతో 65 ITIలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు.
Similar News
News November 16, 2025
ఖమ్మం జిల్లాలో 3.5 కోట్ల చేప పిల్లల విడుదల: కలెక్టర్

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 224 మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో 3.5 కోట్ల చేప పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చెరువుల్లో ఫీడ్ సక్రమంగా అందేలా, నీరు కలుషితంగాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 17 లక్షల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రమాదాల్లో మృతి చెందిన కనకయ్య, మంగయ్య కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు.
News November 16, 2025
KMM: మహిళా డెయిరీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా: కలెక్టర్

ఇందిరా మహిళా డెయిరీ పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎంపీడీవోలను ఆదేశించారు. కలెక్టరేట్లో సమీక్షించిన ఆయన, నిబంధనలను తప్పక పాటించాలని, పశువుల యూనిట్లు అక్రమంగా అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.5వేల మంది లబ్ధిదారులకు 10 వేల పశువుల పంపిణీకి కట్టుదిట్టమైన నిర్వహణ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 15, 2025
ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.


