News February 2, 2025
KMM: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News October 21, 2025
కార్తీక మాసం.. జిల్లాలో ప్రముఖ శివాలయాలివే.!

కార్తీకమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో కడప జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
*పొలతల మల్లికార్జునస్వామి ఆలయం
*ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయం
* వీరపునాయనపల్లె సంగమేశ్వర స్వామి ఆలయం
* అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయం
* సిద్ధవటం నిత్యపూజేశ్వర స్వామి
* జమ్మలమడుగు అగస్తేశ్వరస్వామి ఆలయం
*ఖాజీపేట నాగ నాదేశ్వర కోన.
*పులివెందుల సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయం.
News October 21, 2025
సంగారెడ్డి: 24 నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు ఎమ్మార్సీ కార్యాలయంలో ఉన్నాయని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు వాటిని పాఠశాలలకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
News October 21, 2025
తణుకు: ఇరు వర్గాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

తణుకు మండలం తేతలిలో సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వివాదం తీవ్రమై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ కె. చంద్రశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.