News September 11, 2024
KMM: రేపు జిల్లాలో జాబ్ మేళా ఇంటర్వ్యూ
ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ కెరీర్ కేంద్రంలో ఉద్యోగ మేళాను గురువారం నిర్వహిస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో లోన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 100 ఖాళీలు భర్తీ ఏర్పాటు చేస్తున్నారు. 18 నుంచి 28 ఏళ్లు విద్య హర్షత్ ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు. ఉ.10 గంటలలోగా హాజరు కాగలరని ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News October 9, 2024
బతుకమ్మ పూల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి
అశ్వాపురం మండలం జగ్గారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నున్న ఐలయ్య బతుకమ్మ పండుగ పూల కోసంకోసం గ్రామ పరిధిలో ఉన్న ఊర చెరువులో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నున్న ఐలయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐలయ్య మణుగూరు సురక్ష బస్టాండ్‌లో హమాలీ కార్మికుడిగా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.
News October 9, 2024
దసరా స్పెషల్.. HYD – KMM మధ్య బస్సులు
దసరా పండుగ సందర్భంగా TGSRTC ఈరోజు నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం మధ్య స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాలకు వెళ్లే మహాలక్ష్మి ప్రయాణికుల కోసం LB నగర్ నుంచి ఎక్కువ బస్సులు ఉంటాయన్నారు.
News October 9, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన