News November 14, 2024

KMM: రేపు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం

image

రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు డయల్ యువర్ RM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సరి రామ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో, ఆర్టీసీ బస్సులకు సంబంధించిన ఏమయినా సూచనలు, సలహాలు లేదా ఏవైనా సమస్యలను తెలియజేయడానికి, పైన సూచించిన సమయంలో 99592 25954 నంబర్‌కు డయల్ తెలిపారు.

Similar News

News March 17, 2026

ఈ నెల 22న ఖమ్మం బంద్‌కు పిలుపు

image

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘ఖమ్మం బంద్’కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

News March 17, 2026

ఖమ్మం రైల్వే పనుల్లో జాప్యం

image

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘అమృత్ భారత్’ పథకం కింద రూ. 25.41 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనీస సౌకర్యాలు లేక, మూడో లైను ప్లాట్‌ఫాం నిర్మాణం పూర్తికాక రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 2026 గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News March 17, 2026

ఖమ్మం: ALERT.. రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

జిల్లాలోని SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు మీసేవలో లేదా tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు 60-90% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ప్రధానంగా 2 వీలర్, 3 వీలర్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
# SHARE IT