News January 8, 2025

KMM: రైతు బీమా సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

image

రైతు బీమా, పంటల నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు బీమా పరిహారంలో లోటుపాట్లను సవరించి త్వరతగతిన పూర్తి చేయాలని, అలాగే పంటల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి AEO 25 ఎకరాల ఆయిల్‌పామ్ లక్ష్యం పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Similar News

News January 16, 2025

ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు 

image

ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు. 

News January 16, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం & భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పర్యటన ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన

News January 16, 2025

ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి తన భార్య పేరు పేర్కొనలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంలో కూనంనేని స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. తన రాజకీయ ప్రత్యర్థి వేసిన కేసులో ఆధారాలు లేవని, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కూనంనేని తెలిపారు.