News September 16, 2024
KMM: వాకింగ్ చేస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

గుండెపోటుతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాణాపురం గ్రామానికి చెందిన వట్టికూటి రమేష్ బాబు ఉదయం వాకింగ్ చేస్తూ ఒకసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రమేష్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
Similar News
News November 25, 2025
ఖమ్మం: అంతా ‘మొంథా’ర్పణం

ఖమ్మం జిల్లాలో ‘మొంథా’ తుపాను కారణంగా పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయశాఖ సర్వేచేసి తుది నివేదిక విడుదల చేసింది. జిల్లాలో 17మండలాల్లో 4,268మంది రైతులకు చెందిన 1, 710.72హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని తేల్చారు. 1,499.43 ఎకరాల్లో వరి, 115.82హెక్టార్లలో పత్తికి నష్టం వాటిల్లిందిని కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. అత్యధికంగా కూసుమంచి డివిజన్లో 766.12 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
News November 25, 2025
ఎన్పీడీసీఎల్లో 17 మంది ఇంజనీర్లకు పదోన్నతులు

ఎన్పీడీసీఎల్ (NPDCL) సీఎండీ వరుణ్ రెడ్డి సంస్థలోని పలువురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం సర్కిల్ పరిధిలో ముగ్గురు ఏడీఈలకు డీఈలుగా, 14 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏడీఈలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన రాందాసు కార్పొరేట్ ఆఫీస్‌కు, రమేష్ వైరా డివిజన్‌కు బదిలీ అయ్యారు. ఈ చర్యతో విభాగాల పనితీరు మెరుగుపడుతుందని సంస్థ తెలిపింది.
News November 25, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం
∆} ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సిపిఎం ధర్నా
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం రూరల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశం
∆} నేలకొండపల్లి, తల్లాడ రైతు వేదికల్లో రైతు నేస్తం
∆} రైతులతో వైరా ఎమ్మెల్యే సమావేశం
∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక పూజలు


