News June 12, 2024
KMM: విద్యుత్ బిల్లులు.. ఇక ఈజీ!

విద్యుత్ బిల్లుల చెల్లింపును మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్ ) క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. గడిచిన మే నెలలో ఖమ్మం సర్కిల్ పరిధిలో 1,19,678 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రూ.24.47 కోట్ల బిల్లులను ఆన్లైన్లో చెల్లించారు. ఇక భద్రాద్రి జిల్లాలో 71,865 గృహ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా రూ.13.97 కోట్లను చెల్లించారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 12, 2025
రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై సమీక్ష

ఖమ్మం జిల్లాలోని వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల అభివృద్ధిపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సమీక్ష నిర్వహించారు. వెల్ఫేర్ అధికారులతో ఆమె శుక్రవారం సమావేశమయ్యారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య, సౌకర్యాల కల్పనపై సమగ్రంగా చర్చించారు. పాఠశాలల పనితీరును బలోపేతం చేయాలని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు.
News September 12, 2025
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ప్రధాన న్యాయమూర్తి

ఖమ్మం జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ తెలిపారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’అని పేర్కొన్నారు. రాజీపడదగిన కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక ఉత్తమ అవకాశం అని ఆయన చెప్పారు.