News March 25, 2024
KMM: వేసవి వినోదం జాగ్రత్త మరి

ఎండలకు తాళలేక విద్యార్థులు వేసవిలో బావుల్లో, చెరువుల్లో, ఈతకు వెళ్తుంటారు. ఈత నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగుతూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. పెద్దల పర్యవేక్షణలోని పిల్లలు ఈతకు వెళ్లడం సురక్షితమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం పాల్వంచ మండలంలో 10వ తరగతి విద్యార్థి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
Similar News
News December 22, 2025
ఖమ్మం: ఏఎస్సైలుగా 10 మందికి పదోన్నతి

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్‌గా నిరంతరంగా సేవలందించి ఏఎస్సైగా ఉద్యోగోన్నతి పొందిన 10 మంది హెడ్ కానిస్టేబుళ్లను కమిషనర్ కార్యాలయంలో సోమవారం పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, అభినందనలు తెలియజేశారు. ఏఎస్సైగా పదోన్నతి పొందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.
News December 22, 2025
ఖమ్మం జిల్లాలో రూ.68కోట్లకు పైగా బోనస్: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 331 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి 2,51,847 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 90 శాతం రైతులకు రూ.530 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని చెప్పారు. సన్న వడ్లకు రూ.68 కోట్లకు పైగా బోనస్ అందించామన్నారు.
News December 22, 2025
పాలన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలు ముగిసినందున పాలన వ్యవహారాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబద్దతతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మండల ప్రత్యేక అధికారులుగా కీలకపాత్ర పోషించిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


