News January 18, 2025
KMM: శతాబ్ది బ్రిడ్జిపై.. నిలిచిన రాకపోకలు

నిజాం హయాంలో ఖమ్మంలో నిర్మించిన మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదలకు బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేశారు. అటు రూ.187కోట్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పూర్తికి మరో ఏడాది పడుతుందంటున్నారు. దీంతో పక్కనే కాజ్వేపై రాకపోకలు పునరుద్ధరించడంతో ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం:’ ఓటరు జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి’

ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా–2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బీఎల్ఓలు రోజుకు 30, సూపర్వైజర్లు 300 ఎంట్రీల చొప్పున లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
ఖమ్మం: స్కూల్ బస్సు డ్రైవర్లకు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పరీక్షలు

జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదాల నివారణకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పెనుబల్లి మండలంలో నిన్న స్కూల్ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టి, బస్సులను నిలిపివేసి డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 3, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాగుదారులు ఆందోళన చెందవద్దుని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం నాగులవంచ వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


