News October 11, 2024
KMM: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Similar News
News November 6, 2024
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్
ఖమ్మం జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మద్దతు ధరకే నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రాష్ట్ర గనుల శాఖ కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి కె.సురేంద్ర మోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆయన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.
News November 5, 2024
కొత్తగూడెం: ఫుడ్ డెలివరీ బాయ్ సూసైడ్
కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరం తండాకు చెందిన అజ్మీర శివ(24) ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాలిలా.. వ్యవసాయ పనుల నిమిత్తం వారి తల్లిదండ్రులు ఉదయం పొలాలకు వెళ్లిపోయారు. కాగా సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరి వేసుకుని ఉన్నట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యువకుడు కొత్తగూడెం టౌన్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని చెప్పారు.
News November 5, 2024
ఖమ్మం: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదని, మృతుడు మెరూన్ రంగు షర్ట్, నీలం జీన్స్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచినట్లు చెప్పారు. ఖమ్మం జి.ఆర్.పి.సి భాస్కర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.