News June 28, 2024
KMM: సర్వీస్ గన్‌తో కాల్చుకొని జవాన్ సూసైడ్ అటెంప్ట్!

చర్ల సరిహద్దు ప్రాంతమైన రామ్పురంలో 15వ CAF బెటాలియన్‌కు చెందిన మనోజ్ దినకర్ అనే జవాన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. జవాన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మనోజ్ తన సర్వీస్ గన్‌తో కాల్చుకున్నాడు. గమనించిన తోటి సిబ్బంది అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. జవాన్ పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.
Similar News
News November 17, 2025
ఖమ్మం టీహబ్‌లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం: కూలీల కొరత.. పత్తి రైతులకు కష్టాలు

పెట్టుబడి పెట్టి పండించిన పత్తి పంట చేతికొచ్చే సమయంలో రైతులకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వరి కోతల కారణంగా కూలీలు అటువైపు మళ్లుతుండటంతో, పత్తి కళ్లముందే ఎండిపోతోందని అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవేళ కూలీలు దొరికినా, వారు కిలో పత్తికి రూ.15 నుంచి రూ.20 వరకు అధిక మొత్తంలో అడుగుతున్నారు. దీంతో పత్తి తీసిన ఖర్చులకే సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 17, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మంలో నేడు ఎమ్మెల్సీ కవిత పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి నీలాద్రిశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} జిల్లాలో నేటి నుంచి స్కూళ్లలో తనిఖీలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం


