News June 16, 2024
KMM: సెల్ఫీ దిగిందని అసభ్యకరంగా మెసేజ్‌లు.. అరెస్ట్

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్‌తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News February 24, 2026
ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి

ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూ. 1.25 కోట్ల భారీ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయింపు సహా పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపినట్లు వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
News February 24, 2026
ఖమ్మం: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్థలాల కేటాయింపు

సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించింది.