News June 16, 2024

KMM: సెల్ఫీ దిగిందని అసభ్యకరంగా మెసేజ్‌లు.. అరెస్ట్

image

యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్‌తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News October 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాల అంతరాయం

News October 8, 2024

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్

image

ఖరీఫ్ 2024-25 సీజన్లో ఖమ్మం జిల్లాలో సన్న రకం ధాన్యం కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ శ్రీజ, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పాల్గొన్నారు. ఈ సీజన్లో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

News October 8, 2024

KMM: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.