News July 11, 2024
KMM: స్తంభం ఎక్కే పరీక్షకు ఒక్కరే హాజరు

టీజీ ఎన్పీడీసీఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో జూనియర్ లైన్మెన్ నియామకానికి అభ్యర్థులకు స్తంభం ఎక్కే సామర్థ్య పరీక్ష బుధవారం నిర్వహించారు. ఖమ్మం సర్కిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇద్దరు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థి విజయవంతంగా స్తంభం ఎక్కడంతో అతని ధ్రువీకరణ పత్రాలు పరిశీలనకు వరంగల్ హెడ్ ఆఫీస్‌కు పంపిస్తున్నట్లు ఎస్ఈ సురేందర్ తెలిపారు.
Similar News
News December 5, 2025
మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్‌కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


