News March 16, 2025
KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Similar News
News November 9, 2025
BIGG BOSS: ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. రాము రాథోడ్ నిన్న సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చెప్పి హౌజ్ నుంచి నిష్క్రమించారు. మరోవైపు అతి తక్కువ ఓట్లు రావడంతో ‘గోల్కొండ హైస్కూల్’ మూవీ ఫేమ్ శ్రీనివాస సాయిని బయటికి పంపినట్లు సమాచారం. ప్రస్తుతం హౌజ్‌లో 11 మంది మిగిలారు. మరో 6 వారాల్లో షో ముగియనుండగా టాప్-5కి వెళ్లేదెవరనే ఆసక్తి నెలకొంది.
News November 9, 2025
గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News November 9, 2025
‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.


