News October 23, 2024

KMM: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News November 27, 2024

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఖమ్మం జిల్లాలో బుధవారం 17, అటు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతాలతో 15,16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎముకలు కొరికే ఈ చలిలో ఉదయాన్నే బయటకు రావాలంటేనే ప్రజలు గజ గజలాడుతున్నారు. అటు వృద్ధులు, పిల్లలు పెరుగుతున్న చలి తీవ్రత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది.

News November 27, 2024

ఖమ్మం రీజీయన్‌ RTCలో 116 కాంట్రాక్టు ఉద్యోగాలు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం రీజీయన్‌లో 116 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

News November 27, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరుల విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన