News March 21, 2025

KMM: ఇందిరమ్మ ఇళ్లకు 69,536 అర్హుల గుర్తింపు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇటీవలి బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించగా, ఖమ్మం జిల్లాలో 37,444, భద్రాద్రి జిల్లాలో 32,092 మంది అర్హులను గుర్తించారు, లిస్ట్ ఫైనల్ చేసి తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. అతి త్వరలోనే లిస్ట్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తుండగా, స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 2, 2026

శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం

image

ఖమేనీ మృతికి నిరసనగా శ్రీనగర్‌లో షియా వర్గీయులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లక్నో, శ్రీనగర్ వంటి ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రం కావడంతో.. షియా మత పెద్దల ప్రసంగాలపై నిఘా పెట్టాలని సూచించింది. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌పై పాక్షిక ఆంక్షలు విధించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలంది.

News March 2, 2026

నెల్లూరు: నర్సింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు నర్సింగ్ హోమ్ కరస్పాండెంట్ ప్రభుదాసు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NEET-UG పరీక్షకు హాజరై ఉంటే సరిపోతుందన్నారు. మార్చి 8వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే తమ కాలేజీని సంప్రదించాలన్నారు.

News March 2, 2026

చేగుంట మండలంలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం చేగుంట మండలంలో కలకలం రేపింది.. పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు.. గ్రామ శివారులోని రోడ్డు పక్కన ఒక మగ వ్యక్తి మృతి దేహాన్ని గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.