News August 2, 2024
KMM: ఇదే చివరి అవకాశం

DOST ద్వారా డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. అయితే స్పెషల్ విడత ద్వారా రిజిస్ట్రేషన్‌కు గడువు నేటితో ముగియనుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని SR&BJNR ప్రిన్సిపల్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈనెల 6న సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సీట్ అలాట్ అయిన వారు ఆగస్టు 7 నుంచి 9 వరకు సెల్ఫ్ రిపోర్ట్ ఇవ్వడానికి అవకాశం కల్పించారు.
Similar News
News April 3, 2026
ఉపరాష్ట్రపతితో బీఆర్‌ఎస్ ఎంపీల భేటీ

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్‌ను బీఆర్‌ఎస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంటరీ పార్టీ నేత కె.ఆర్.సురేష్ రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్ రావు గురువారం ఆయన ఛాంబర్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్‌ను కలిసి పలు అంశాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు.
News April 3, 2026
అటవీ అభివృద్ధిపై మాజీ, ప్రస్తుత అధికారుల చర్చ

అటవీ సంరక్షణ, అభివృద్ధిపై ఇద్దరు ఐఎఫ్‌ఎస్ అధికారుల భేటీ ఆసక్తిని రేకెత్తించింది. ఖమ్మం జిల్లా ప్రస్తుత డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్.. మాజీ అటవీశాఖ అధికారి రాజేష్ మిట్టల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1986లో ఉమ్మడి ఖమ్మం డీఎఫ్‌ఓగా పనిచేసిన మిట్టల్‌తో ప్రస్తుత పరిస్థితులు, అటవీ విస్తరణ, గిరిజన గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. ఆనాటి క్షేత్రస్థాయి అనుభవాలను మిట్టల్ పంచుకున్నారు.
News April 3, 2026
ఖమ్మం జిల్లాలో గ్రామ, వార్డు సభలు విజయవంతం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయని అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. మొత్తం 571 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని 177 వార్డుల్లో ఈ సభలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక సమస్యలపై పారదర్శకంగా చర్చలు జరిగాయన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆమె కొనియాడారు.


