News May 11, 2024

KMM: ఇవాల్టితో ప్రచారానికి తెర

image

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగడుతున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి సాయంత్రంతో ఆ క్రతువు ముగియనుంది. ఐదేళ్ల పాలనకు ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

Similar News

News February 27, 2026

సర్పంచ్ నుంచి జిల్లా స్థాయికి

image

కారేపల్లి పోలంపల్లి సర్పంచ్ హేమలత బాలాజీ నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. గ్రామాభివృద్ధిలో ఆమె చూపుతున్న చొరవను గుర్తిస్తూ జిల్లా ‘దిశ’ కమిటీ సభ్యురాలిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సామాన్య సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, జిల్లా స్థాయి వేదికకు ఎంపికవ్వడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమస్యలను జిల్లా స్థాయిలో వినిపించి, మరిన్ని నిధులు సాధిస్తానని ఆమె ఆకాంక్షించారు.

News February 27, 2026

ఏరుగట్లలో గుప్తనిధుల కలకలం..!

image

పెనుబల్లి మండలం ఏరుగట్లలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ముత్యాలమ్మ గుడి సమీపంలో క్షుద్రపూజలు నిర్వహిస్తూ, జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులు పట్టుబడ్డారు. ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకున్న వీఎం బంజర్ పోలీసులు..ఘటనా స్థలంలో జేసీబీ, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2026

పోలీస్ భవనాల ప్రారంభానికి డీజీపీ.. ఖమ్మంలో హై అలర్ట్

image

రాష్ట్ర డీజీపీ శివధర్‌ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నూతన పోలీస్‌ భవనాల ప్రారంభోత్సవం నిమిత్తం ఆయన వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో డీజీపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.