News January 1, 2026
KMM: ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కల్లూరులో పర్యటించిన ఆయన కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటి పురోగతిని బట్టి ప్రతి సోమవారం నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News January 9, 2026
మారేడు దళాల గురించి ఈ విషయాలు తెలుసా?

మారేడు చెట్టును ఇంట్లో పెంచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. దీని దళాలు కోసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. సోమ, మంగళ, శుక్రవారాలు, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో వీటిని కోయకూడదు. ఒకసారి శివుడికి అర్పించిన ఆకులను కడిగి తిరిగి 30 రోజుల వరకు పూజకు ఉపయోగించవచ్చు. నేల మీద పడినా ఇవి దోషం కావు. శివార్చనలో మారేడు దళాలను కొబ్బరి నీళ్లలో ముంచి సమర్పిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
News January 9, 2026
‘ఏడాది కాలంలో ఏం సాధించారు?’.. ఉద్యోగులకు అమెజాన్ మెయిల్స్!

గతేడాది 14 వేల <<18191233>>మందిని<<>> తొలగించిన అమెజాన్ ఇప్పుడు ఉన్న ఉద్యోగులపైనా ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. ‘ఏడాది కాలంలో మీరు ఏం చేశారు? మీరు సాధించిన 3-5 విజయాల గురించి ప్రస్తావించండి’ అని మెయిల్స్ పంపుతోందని Business Insider తెలిపింది. వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతోందని చెప్పింది. సంస్థపై తమ ప్రభావం, ప్రాజెక్టులు, ఇనిషియేటివ్స్ గురించి ఉద్యోగులు తెలియజేయాల్సి ఉంటుంది.
News January 9, 2026
కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

కుప్పం డివిజన్‌లోని 26 సబ్‌స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.


