News April 10, 2025
KMM: కూలీ బిడ్డ.. ఏడాదిలో 5కొలువులు సాధించింది.!

సాధించాలనే తపన ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఖమ్మం(D) తల్లాడ(M) మిట్టపల్లికి చెందిన జంగం పౌలు-శారమ్మల కుమార్తె జ్యోతి శిరీష. ఒకే ఏడాది 5 ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది. ఇటీవల గ్రూప్-1లో రాష్ట్రస్థాయి ర్యాంకు పొందింది. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు.. ఆర్థికంగా అంతంతే అయినా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వ కొలువుకు ఎంపికకావడంపై ఆమె తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
ఖమ్మం జిల్లాలో 15 నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల బంద్

ఖమ్మం జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రైవేటు విద్యాసంస్థల బాధ్యులు మల్లెంపాటి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బకాయిలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News September 13, 2025
ఖమ్మం: కాంగ్రెస్లో వర్గపోరు.. పరస్పరం దాడులు

బోనకల్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెండు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఒక వ్యక్తి చెవి తెగిపోగా, మరొకరిని మహిళలు చెప్పులతో కొట్టి గాయపరిచారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 13, 2025
ఖమ్మం: పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా మద్దతు ధరతో కొనుగోళ్లు జరగాలని అ.కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 27,07,356 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 5సిసిఐ కేంద్రాలు, 9 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.