News March 30, 2025
KMM: గతం గుర్తుకురావడం లేదని యువతి ఆత్మహత్య

తిరుమలాయపాలెం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థిని బాతుల ఉదీప(20) ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలిలా.. ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం వద్ద కాలేజీలో గత ఆరు నెలల క్రితం కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. గతం గుర్తుకు రాక ఇబ్బంది పడుతుండగా, మనస్తాపం చెంది ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 2, 2025
కోర్టు సినిమా హీరోను అభినందించిన ఎమ్మెల్యే

భద్రాచలం విచ్చేసిన కోర్టు మూవీ హీరో రోషన్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. చిన్న వయసులో సినిమా రంగంలోకి ప్రవేశించి కోర్టు మూవీ ద్వారా పెద్ద హిట్ కొట్టినందుకు అభినందించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సినిమా రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు భద్రాచలం పట్టణాన్ని పరిచయం చేయడం గర్వంగా ఉందన్నారు.
News April 2, 2025
ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్లాస్టిక్ రహితం చేయాలి: కలెక్టర్

ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని పేర్కొన్నారు.
News April 2, 2025
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి: మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.21,000కు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ధర రూ. 8,500 మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ధర పెరగడంతో రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని, ఇంకా మరింతమంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.