News March 30, 2025
KMM: గతం గుర్తుకురావడం లేదని యువతి ఆత్మహత్య

తిరుమలాయపాలెం మండలానికి చెందిన బీటెక్ విద్యార్థిని బాతుల ఉదీప(20) ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాలిలా.. ఖమ్మం రూరల్ మండలం మంగళ గూడెం వద్ద కాలేజీలో గత ఆరు నెలల క్రితం కిందపడటంతో తలకు బలమైన గాయమైంది. గతం గుర్తుకు రాక ఇబ్బంది పడుతుండగా, మనస్తాపం చెంది ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 5, 2025
రబీలో రాగులు సాగు – ముఖ్య సూచనలు

రాగులును విత్తడానికి ముందు kg విత్తనానికి కార్బండజిమ్ 2గ్రా. లేదా మాంకోజెబ్ 2గ్రాములతో విత్తనశుద్ధి చేయాలి. తేలికపాటి దుక్కిచేసి విత్తనం చల్లి పట్టె తోలాలి. నారుపోసి నాటాలి. 85-90 రోజుల రకాలకు 21 రోజుల మొక్కలను, 105-125 రోజుల పంటకాలం గల రకాలకు 30 రోజుల మొక్కలను నాటాలి. స్వల్పకాల రకాలకు వరుసల మధ్య 15cm, మొక్కల మధ్య 10cm, దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20cm, మొక్కల మధ్య 15cm దూరం ఉండేలా విత్తాలి.
News November 5, 2025
వీటిని క్లీన్ చేస్తున్నారా?

మేకప్ బ్రష్‌లు, స్పాంజ్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. కానీ వాటిని ఏడాదికోసారైనా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంపాటు మార్చకుండా ఉంటే మేకప్ అప్లికేషన్, బ్లెండింగ్ నాణ్యత తగ్గుతుంది. అలాగే వీటిని రెగ్యులర్‌గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగి మొటిమలు, ఇతర చర్మసమస్యలు వస్తాయి. వేడి నీళ్లు, డిష్ వాషర్ సోప్, యాంటి బ్యాక్టీరియల్ సోప్, బేబీషాంపూతో వాటిని సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.
News November 5, 2025
ఇవాళ రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

ఇవాళ రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రానున్నాడు. దీంతో సాధారణం కంటే 14% పెద్దగా, 30% అధిక కాంతివంతంగా కనువిందు చేయనున్నాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తున్నారు. మన దేశంలో రా.6.49 గంటలకు పూర్ణచంద్రుడు దర్శనమిస్తాడు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది.


