News February 6, 2025
KMM: గుడ్ న్యూస్.. ఒకేషనల్ స్టూడెంట్స్‌కు ఆహ్వానం
ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.రవిబాబు ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1000 ఆసుపత్రి పేరున డీడీ చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
Similar News
News February 6, 2025
ఖమ్మం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈనెల 10నుంచి 20వరకు రద్దు చేస్తున్నట్లు, ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని తెలిపారు.
News February 6, 2025
ఖమ్మం: భార్య మర్డర్.. భర్త, అత్తకు జీవిత ఖైదు
భార్యను హతమార్చిన కేసులో భర్తకు, ఆమె అత్తకు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. మెజిస్ట్రేట్ వివరాలిలా.. ముదిగొండ మండలం బాణాపురం తండాకు చెందిన టీ.ఉపేందర్ 2017లో కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం 2020లో హత్య చేశాడు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు కాగా, విచారించిన కోర్టు భర్త ఉపేందర్, అత్త పద్మకు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది.
News February 5, 2025
KMM: మంత్రి పొంగులేటి ప్రకటన.. గ్రామాల్లో సందడి
ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడుతుందని మంత్రి పొంగులేటి ప్రకటనతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 577 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి. తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.