News September 12, 2025
KMM: టీజీఎస్‌ఆర్టీసీ ‘యాత్రాదానం’ కార్యక్రమం ప్రారంభం

టీజీఎస్‌ఆర్టీసీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా “యాత్రాదానం” సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభ సందర్భాలలో ప్రజలు, సంస్థలు ఇచ్చే విరాళాలతో అనాథలు, నిరాశ్రయులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రలకు పంపుతామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు హెల్ప్‌లైన్ నెంబర్ 040-69440000ను సంప్రదించాలన్నారు.
Similar News
News September 12, 2025
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ప్రధాన న్యాయమూర్తి

ఖమ్మం జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్‌లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ తెలిపారు. ‘రాజీ మార్గమే రాజమార్గం’అని పేర్కొన్నారు. రాజీపడదగిన కేసులలో కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక ఉత్తమ అవకాశం అని ఆయన చెప్పారు.
News September 12, 2025
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు.
కలెక్టర్ గోడౌన్‌లోని సీల్‌ను, లోపల ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాలు, స్లాబ్, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ అప్రమత్తతపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని ఆదేశించారు.
News September 12, 2025
ఖమ్మం: అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్&బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ వంటి శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుత పనులపై వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.