News April 5, 2024

KMM: డయల్ 100కు 4,205 ఫోన్ కాల్స్: సీపీ

image

శాంతిభద్రతల సమస్యలకు సంబంధించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రవేశపెట్టిన డయల్ 100కు మార్చి నెలలో 4,205 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 75 ఫోన్లకు సంబంధించి FIRలు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు వంటివి ఉన్నాయని తెలిపారు.

Similar News

News November 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం  ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 25, 2024

ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతెలిపారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ వివరించారు.

News November 25, 2024

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం పాల్వంచ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని ఎస్సి బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే పాఠశాల సిబ్బందికి తెలపాలని కలెక్టర్ విద్యార్థినులను సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.