News May 3, 2024
KMM: తగ్గిన ఎమ్మెల్సీ ఓటు నమోదు.

2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News March 1, 2026
ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌ఓ

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.
News March 1, 2026
భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుంది: తుమ్మల

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు చేసిన మోసం బయటకు రాకుండా కొందరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు పశ్చాత్తాపపడతారన్నారు.
News March 1, 2026
రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఖమ్మం జిల్లా

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్ ఐడీ’ (రైతు గుర్తింపు కార్డు) నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 75.59 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య వెల్లడించారు. జిల్లాలోని 3.39 లక్షల మంది రైతులకు గాను, ఇప్పటికే 2.33 లక్షల మంది 11 అంకెల ఐడీలను పొందారు. మిగిలిన రైతులు మార్చి 15లోగా ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు.


