News April 13, 2025
KMM: తెల్లవారుజామున ప్రమాదం.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 14, 2025
ఖమ్మం: కేఎంసీలో ప్రత్యేక కౌంటర్ల వద్ద దరఖాస్తుల స్వీకరణ

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. దీంతో దరఖాస్తులను స్వీకరించేందుకు ఖమ్మం కేఎంసీ అధికారులు సోమవారం ప్రత్యేక కౌంటర్లు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసి కౌంటర్లను తెరిచి ఉంచాలని నిర్ణయించారు. మెప్మా సిబ్బంది ఈ కౌంటర్ల వద్ద దరఖాస్తుదారులకు రశీదులు ఇవ్వనున్నారు. ఈ కౌంటర్ల వద్ద ఆఫ్లైన్ దరఖాస్తులను సిబ్బంది తీసుకోనున్నారు. కాగా, ఇప్పటికే కేఎంసీ పరిధిలో 6,166 దరఖాస్తులు వచ్చాయి.
News April 14, 2025
లాయర్లకు న్యాయం జరిగేలా చూడాలని ఎంపీకి వినతి

అడ్వకేట్ అమండ్మెంట్ బిల్ 2025లో ఉన్న లోపాలను సవరించి లాయర్లకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం ఎంపీ రఘు రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. న్యాయవాద నోటరీ నోటిఫికేషన్ 2021లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహణలో జాప్యం లేకుండా చూడాలని, బాధితులకి సత్వర న్యాయం జరిగేలా నాన్ బెయిలబుల్ కేసుల్లో ఏడేళ్ల లోపు శిక్ష పడే జడ్జిమెంట్ పై చర్చించాలని కోరారు.
News April 14, 2025
ఖమ్మం: అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం: ఎంపీ

రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌తో కలిసి అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీ నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాలరాసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.