News June 26, 2024

KMM: నామినేటెడ్ పదవుల కోసం నేతల పోటాపోటీ

image

ఎన్నికల కోడ్ ముగియడం పరిపాలనలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నేతల్లో మళ్లీ నియామక పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వ నియామక పదవులు ఖరారవుతాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వివిధ శాఖలో ఉన్న నామినేటెడ్ పదవులకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 

Similar News

News June 29, 2024

కేసీఆర్‌ ఉక్కుసంకల్పం నెరవేరింది: MLC తాతామధు

image

సీతారామప్రాజెక్టు ట్రయల్‌రన్‌ విజయవంతంతో మాజీ సీఎం కేసీఆర్‌ ఉక్కుసంకల్పం నెరవేరినట్లయిందని MLC తాతామధు తెలిపారు. ఖమ్మంలోని శుక్రువారం ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఇన్నాళ్లు కుంభకోణమని నిందించిన వారు, ఇప్పుడెలా ట్రయల్‌రన్‌ను ప్రారంభించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News June 29, 2024

రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు : RMKMM

image

ప్రయాణికుల తమ రిజర్వేషన్ టికెట్లను 8 రోజుల ముందస్తుగా చేసుకున్నట్లయితే రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరీరామ్ అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి నాన్ ఏసి స్లీపర్, లహరి ఏసి స్లీపర్, బస్సులలో వర్తిస్తుందని అన్నారు.

News June 28, 2024

ఖమ్మం: రోడ్డు పక్కన శిశువు మృతదేహం

image

పసి గుడ్డును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన కూసుమంచి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం నుంచి కోదాడ వెళ్లే 5 నెలల శిశువును రోడ్డు పక్కన ఉంది. మాదిగ కుంట వైపు వెళ్తున్న సతీశ్ అనే వ్యక్తికి శిశువు కనిపించింది. జీపీ సెక్రటరీకి తులసిరాంకీ సమాచారం అందించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారు కూసుమంచి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.