News April 5, 2024
KMM: పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా సీ- విజిల్ యాప్!

ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ- విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్లు కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
Similar News
News November 12, 2025
ఖమ్మం జిల్లాలో 10 నెలల్లో రూ. 14 కోట్లు దోపిడీ

ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలు హడలెత్తిస్తున్నాయి. గత 10 నెలల్లోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 330కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు జిల్లా వాసుల నుంచి ఏకంగా రూ. 14 కోట్లు దోచుకున్నారు. నష్టపోయిన 24 గంటల్లో ఫిర్యాదు చేయడంతో రూ. 4 కోట్లు రికవరీ అయింది. కొరియర్ వచ్చిందంటూ ఓటీపీ చెప్పించడం ద్వారానే ఎక్కువ మోసాలు జరిగాయి.
News November 12, 2025
‘ఖమ్మం కలెక్టర్ సారూ.. ఇల్లు మంజూరు చేయరూ’

ఖమ్మం నగర శివారు అల్లీపురంలో నివసిస్తున్న దివ్యాంగ దంపతులు అంతోని అంజమ్మ, గోపాల్ ఇటీవలి గ్రీవెన్స్ డేలో తమ గోడును కలెక్టర్‌కు విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఇల్లు కట్టుకునే స్థోమత లేక డబుల్ బెడ్‌రూమ్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు. కలెక్టర్, ఇతర అధికారులైనా స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.
News November 11, 2025
ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


