News June 16, 2024
KMM: ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని అడ్డుకోరా?

ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారుతున్నాయి. దీనికి తోడు యూనిఫాం, షూస్, బెల్టులు, పుస్తకాల ఫీజుల పేరిట ప్రైవేటు స్కూళ్లు నిలువు దోపిడీ చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా మధ్య మధ్య లో ఈవెంట్లు, వేడుకల కోసం చిన్నారులకు ప్రత్యేక దుస్తులకు, క్యాస్టూమ్కు మరికొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని, అధికారులు ఈ దోపిడీని అడ్డుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 27, 2025
ఖమ్మం: వారి మధ్య డీసీసీ ఫైట్

ఖమ్మం డీసీసీ అధ్యక్ష పదవి కోసం మంత్రులు పొంగులేటి, భట్టి, తుమ్మల అనుచరుల మధ్య పోటీ నెలకొంది. భట్టి వర్గం నుంచి నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి వర్గం నుంచి సూతకాని జైపాల్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల వర్గం నుంచి కార్పొరేటర్ కమర్తపు మురళి ఉన్నారు. వీరే కాక ఎంపీ రేణుకాచౌదరి ఫాలోవర్స్ కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
News October 27, 2025
ఖమ్మం: నేడే లక్కీ డ్రా.. తీవ్ర ఉత్కంఠ..!

ఖమ్మం జిల్లాలో 2025-27 మద్యం పాలసీకి సంబంధించిన 122 దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎక్సైజ్ అధికారులు ఈ డ్రాను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్, లకారం రిక్రియేషన్ జోన్ వద్ద తీయనున్నారు. ఈ 122 దుకాణాల కోసం 4,430 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.132.90 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నేడు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో వైన్స్ టెండర్ ఎవరికి దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
News October 26, 2025
ఖమ్మం ఉద్యాన అధికారికి ‘రైతు నేస్తం’ పురస్కారం

HYDలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించిన ‘రైతు నేస్తం’ అవార్డుల ప్రదానోత్సవంలో ఖమ్మం జిల్లా ఉద్యాన అధికారి ఆకుల వేణు పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం వ్యవస్థాపకుడు వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా అతిథులు అభినందించారు.


