News March 23, 2025
KMM: బెట్టింగ్ బూతం.. జీవితాలు నాశనం!

ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఖమ్మం జిల్లాలో ఇటీవలే ఇద్దరు యువకులు మృతి చెందారు. భద్రాద్రి జిల్లాలో అయితే ఒకరు కట్నం డబ్బు మొత్తాన్ని బెట్టింగ్‌లోనే పోగొట్టుకొని ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. యువతపై కుటుంబ సభ్యులు నిరంతరం దృష్టి సారించాలని పోలీసులు సూచించారు.
Similar News
News March 24, 2025
సీఎం పర్యటన విజయవంతం చేయాలి: బాపట్ల కలెక్టర్

చినగంజాం మండలం చిన్న గొల్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు రానున్నారని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. ఏప్రిల్ ఒకటో తేదీన సీఎం పర్యటన ఖరారు నేపథ్యంలో జిల్లా అధికారులతో సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జయప్రదం చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, తదితరులు ఉన్నారు.
News March 24, 2025
జోనర్ మార్చిన వరుణ్ తేజ్

కొంత కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోనర్ మార్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న హారర్ చిత్రంలో ఆయన నటించేందుకు పచ్చ జెండా ఊపారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.
News March 24, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. 23 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్ష జరగ్గా.. మొత్తం 12,579 విద్యార్థులకు గాను 12,556 మంది పరీక్ష రాయగా, 23 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని తెలిపారు.