News January 1, 2026
KMM: భద్రాద్రి ఆలయ విస్తరణకు భూసేకరణ పూర్తి.!

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామాలయ పునరుద్ధరణ పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఆలయ విస్తరణకు భూసేకరణ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 2026 మార్చిలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నాటికి ఆలయానికి నూతన శోభ తీసుకురావాలన్న లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వం విడుదల చేసిన రూ.34 కోట్లతో భూసేకరణను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
Similar News
News January 1, 2026
గన్నేరువరం: మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండలం కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడ్డారు. అమ్మవార్లను దర్శించుకుని పెద్ద సంఖ్యలో ముడుపులు సమర్పించారు.
News January 1, 2026
ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఈరోజు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిట్ నెస్ లేని వాహనాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. జనవరి 1-31 వరకు జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
News January 1, 2026
జల వివాదాలపై చర్చకు సర్కార్ సిద్ధం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల వివాదంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో BRSను ఎదుర్కోవడంపై సీఎం రేవంత్ సహా మంత్రులు సన్నద్ధమవుతున్నారు. కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో జరిగే చర్చలో ఎలా వ్యవహరించాలనేదానిపై నేతలకు సీఎం కూడా దిశానిర్దేశం చేశారు.


