News April 27, 2024

KMM: మరో పది రోజులు జాగ్రత్త!!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పలుచోట్ల 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా భద్రాద్రిలో 44 డిగ్రీలకు పైగా నమోదైంది. నేటి నుంచి మరో 10 రోజులపాటు విపరీతమైన వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 11, 2025

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి: మంత్రులు

image

ఖమ్మం జిల్లాలోని ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్‌కు కేంద్రాలను ప్రారంభించాలని ధాన్యం త్వరగా తరలించాలని సూచించారు. తార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు సహా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.

News November 11, 2025

ఖమ్మం: సదరం స్కామ్‌.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌

image

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో గత రెండేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సదరం విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. స్కామ్‌లో పాలుపంచుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News November 11, 2025

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియామకం

image

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవులో ఉన్న జైనీని ఖమ్మం డీఈవోగా నియమించారు. ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శ్రీజ స్థానంలో రెండు రోజుల్లో చైతన్య జైనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి అధికారిని నియమించాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.