News January 15, 2025
KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News July 6, 2025
ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.
News July 6, 2025
ఖమ్మం శ్రీలక్ష్మీ రంగనాథ ఆలయంలో ఏకాదశి వేడుకలు

ఖమ్మం రంగనాయకుల గుట్టపై స్వయంభు కరిగిరి శ్రీలక్ష్మీ రంగనాథస్వామి వారి దేవస్థానంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు బూరుగడ్డ శ్రీధరాచార్యులు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకం, సువర్ణపుష్పార్చన, ఉదయం 9:30కు సుదర్శన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా పూర్ణాహుతి ఉంటుందని, భక్తులు సకాలంలో హాజరై, స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
News July 5, 2025
విద్యాలయాల్లో మౌళిక వసతుల కల్పనకు కృషి: ఖమ్మం కలెక్టర్

రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం ఖమ్మం దానవాయిగూడెం, కోయచిలక క్రాస్ రోడ్డులోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. గురుకులంలో చేపట్టాల్సిన మైనర్ మరమ్మతులపై నివేదిక అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.