News April 13, 2024
KMM: రక్తంతో ‘గుమ్మడి’ చిత్రపటం

ఇల్లెందు మాజీ MLA గుమ్మడి నర్సయ్య చిత్రపటాన్ని తన రక్తంలో గీయించి ఫ్రేమ్ కట్టిచాడు ఓ వీరాభిమాని. సెలబ్రేటీలకే వీభిమానులు ఉన్న ఈ రోజుల్లో 5సార్లు MLAగా చేసి నేటికీ సాధారణ జీవితం గడుపుతున్న గుమ్మడికి తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన వెంకటేశ్ వీరాభిమానిగా మారాడు. ఆ అభిమానంతోనే అలాంటి నేత కోసం తన రక్తంతో చిత్రపటం గీయించి ఆయన ఆదర్శాలను అందరికీ చాటిచెప్పాలని భావించినట్లు వెంకటేశ్ చెప్పారు.
Similar News
News April 14, 2026
ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
News April 14, 2026
KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.