News January 10, 2025

KMM: రాష్ట్ర స్థాయి పోటీల్లో మొదటి స్థానంలో ప్రణీత్

image

భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని జగన్నాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇ.ప్రణీత్ మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 7,8,9 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ జూనియర్ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఈ క్రమంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని, గైడ్ సారలమ్మను టీచర్లు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News November 12, 2025

‘ఖమ్మం కలెక్టర్ సారూ.. ఇల్లు మంజూరు చేయరూ’

image

ఖమ్మం నగర శివారు అల్లీపురంలో నివసిస్తున్న దివ్యాంగ దంపతులు అంతోని అంజమ్మ, గోపాల్ ఇటీవలి గ్రీవెన్స్ డేలో తమ గోడును కలెక్టర్‌కు విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఇల్లు కట్టుకునే స్థోమత లేక డబుల్ బెడ్‌రూమ్ కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని వారు వాపోయారు. కలెక్టర్, ఇతర అధికారులైనా స్పందించి తమకు ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు.

News November 11, 2025

ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

image

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

News November 11, 2025

ఖమ్మం కలెక్టర్‌ను కలిసిన నూతన DEO

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖ అధికారి(డీఈఓ)గా నియమితులైన చైతన్య జైని, బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా రంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.