News November 19, 2024
KMM: రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం: భట్టి
వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వరంగల్ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. “అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నాం. ఇచ్చిన హామీలన్నింటిని ప్రభుత్వం నెరవేరుస్తోంది. రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తాం. 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించాం” అని చెప్పారు.
Similar News
News November 21, 2024
వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News November 21, 2024
ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్యాధికారుల సూచనలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో 17 డిగ్రీలు, భద్రాద్రి జిల్లాలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
News November 21, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు
☆ ఖమ్మం నగరంలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన
☆ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం, భద్రాద్రిలో నేడు ప్రత్యేక పూజలు
☆ మధిరలో నేడు విద్యార్ధులకు టాలెంట్ టెస్ట్
☆ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న కులగణన సర్వే
☆ అశ్వారావుపేటలో నేడు ఎమ్మెల్యే జారే పర్యటన
☆ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
☆ పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన