News January 13, 2025
KMM: రూ.22వేల కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు: డి.సీఎం భట్టి
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. కానీ గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు.
Similar News
News February 5, 2025
ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.
News February 5, 2025
వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ
విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC,ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
News February 5, 2025
ఖమ్మం పోలీసులకు 42 పతకాలు.. సీపీ అభినందన
ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ విభాగాల్లో జిల్లా ఉద్యోగులు 42 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్ దత్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. సవాళ్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే క్రీడల్లో పతకాలు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లోనూ పతకాలు సాధించాలని కాంక్షించారు.