News February 2, 2025

KMM: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు

image

NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Similar News

News February 2, 2025

అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది: పొంగులేటి

image

ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సత్తుపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, భరోసానిచ్చారు.

News February 2, 2025

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు: సీఐ రమేశ్

image

ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేశ్ తెలిపారు. ప్రకాష్ నగర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ అదే ప్రాంతానికి చెందిన బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. ఆమె చదువుతున్న పాఠశాలకు సైతం వెళ్లి బెదిరిస్తుండటంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

News February 2, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆}  ఖమ్మంలో కాంగ్రెస్ నిరసన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన∆} నేలకొండపల్లిలో రామదాసు జయంతి ఉత్సవాలు