News October 10, 2025

KMM: రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం

image

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల హాజరవుతారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.

Similar News

News October 11, 2025

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్‌లో కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు. ఈ నెల 13 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని తెలిపారు. నగరంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 10, 2025

ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో.. పీహెచ్‌సీల్లో 100% సిబ్బంది హాజరు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, అధిక సీ-సెక్షన్ డెలివరీలు చేసే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎన్‌సీడీ సర్వే, టీకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

News October 10, 2025

KMM: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీలలో పనిచేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్‌ను ఆన్‌లైన్ చేసి, 100% మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.